సిరా న్యూస్,మచిలీపట్నం;
పెడన ఎస్సీ కాలని లో అంబేద్కర్ విగ్రహం పై దాడి కి యత్నించిన కేసు విషయంలో దళిత సంఘాల నేతలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ముందుగా మచిలీపట్నం లోని అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బందరు తాలూకా సిఐ కార్యాలయం ముందు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. 24 గంటలు గడిచినా నిందితులపై చర్యలు తీసుకోకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో తాలూకా సిఐ కార్యాలయానికి దళిత సభ్యులు భారీగా చేరుకున్నారు.