సిరా న్యూస్,భువనగిరి;
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ఎక్కిన రైతన్నలు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధాన్యం పోసి నిప్పు పెట్టారు. దాంతో నాలుగు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఆరుకాలం కష్టపడి పండించిన పంట కల్లాల వద్దకు వచ్చిన నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు రోడ్డు ఎక్కారు. బీబీనగర్ మండలం గూడూరు వద్ద రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి నిరసన వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇటు అధికారులు కానీ మిల్లర్లు కానీ రైతుల నిలువుగా దోచుకుంటున్నారని ఇకనైనా రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు..