సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని.. శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా.. ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం కి భూనిర్వాసితులకు కొందరికి నష్టపరిహారం ఇవ్వకుండానే ఊరికి వెల్లే దారిని తెంచేసి రాకపోకలకు బంద్ చేశారు. కాంట్రాక్టర్లు, అధికారుల తీరుకు నిరసిస్తూ.. ప్రభుత్వ పనితీరును తప్పు పడుతూ.. ప్రాజెక్టు పనులను అడ్డగించారు బాధితులు. ఈ క్రమంలో.. పోలీసుల సమక్షంలో ప్రాజెక్టు DE కాశీం వచ్చి.. వచ్చే వారం రోజుల పాటు రాకపోకలకు అంతరాయం కలగకుండా రోడ్డును తవ్వమని హామి ఇవ్వటంతో గ్రామస్తులు శాంతించారు. అయితే.. బాధిత నర్సిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్లే రొడ్డును తవ్వేశారు. అధికారులు స్వయంగా హామీ ఇచ్చారని.. మళ్ళీ యధావిధిగా పనులు చేసి తమ గ్రామంలోకి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.
======