సిరాన్యూస్, కుందుర్పి
తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అండ: అమిలినేని సురేంద్ర బాబు
మైనారిటీలకు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న జామీయా మసీదులో ముస్లిములతో ఆత్మీయ కలయికలో ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు పాల్గొన్నారు. అనంతరం ముస్లిములు వారి సాంప్రదాయం ప్రకారం అమిలినేని సురేంద్ర బాబుకు సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీలు, కుందుర్పి మైనార్టీలు పాల్గొన్నారు