సిరా న్యూస్, కుందుర్పి
ముందంజలో అమిలినేని సురేంద్ర బాబు
* సాయంత్రం కళ్యాణదుర్గానికి రాక
* ఏర్పాట్ల లో టీడీపీ శ్రేణులు
కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు భారీ మెజారిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతి రౌండ్ లోను అమిలినేని సురేంద్ర బాబు మెజారిటీ తో దూసుకెళ్తున్నారు. అయితే 13రౌండ్ లు పూర్తి అయ్యే సరికే 31వేలు దాటింది. మరో 6రౌండ్ లలో 10వేలు వచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక నా పయనం కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలతోనే అని అమిలినేని సురేంద్ర బాబు అంటున్నారు. డిక్లరేషన్ ఫారం తీసుకొని డైరెక్ట్ గా కళ్యాణదుర్గానికి విచేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సంతోషాన్ని కళ్యాణదుర్గం ప్రజలతో పంచుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.