సిరాన్యూస్, కుందుర్పి
నేడు కళ్యాణదుర్గంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్ర బాబు 37,734 ఓట్లతో విజయం సాధించారు. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కళ్యాణదుర్గంకి అమిలినేని సురేంద్ర బాబు వస్తున్నారు. ఇందులో భాగంగా అక్కమ్మ దేవతల దేవాలయలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ షిరిడీ సాయి బాబా దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేవిధంగా టి సర్కిల్, గాంధీ సర్కిల్, వాల్మీకి సర్కిల్ మీదుగా ప్రజావేదికకు చేరుకొని ఓటర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. కుందుర్పి మండలంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు తరలిరావాలని కోరారు.