సిరా న్యూస్, కుందుర్పి
వీరంజనేయ స్వామి వారిని దర్శించుకున్నఅమిలినేని యశ్వంత్
* దేవాలయానికి ఆర్థిక సాయం అందజేత
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం, వడ్డిపాళ్యం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ గుడిబండ వీరంజనేయ స్వామి జాతరను ప్రతిఏట సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కుమారుడు, యువనాయకుడు అమిలినేని యశ్వంత్ ఆలయాన్ని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ అభివృద్ధికి 1,30,000/- (ఒకలక్ష ముప్పైవేల రూపాయలు) విరాళంగా దేవాలయ అభివృద్ధికి అందజేశారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసారు. గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు