సిరా న్యూస్,విజయవాడ;
లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైసీపీ కార్పొరేటర్లు పాల్గోన్నారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కాదు…ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారు. పరిపాలనలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. ఇలాంటి నీచరాజకీయాలు చంద్రబాబు,టీడీపీకే చెల్లుబాటు. నేను విదేశాల్లో చదువుకున్నప్పుడు ఏపీ గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఈరోజు చంద్రబాబు వల్ల రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతింది. వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారు . ప్రజలు తమను ప్రశ్నిస్తారనే… తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారు
దేవుడిని దర్శించుకోవాలన్నా నోటీసులిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే మీకెందుకు అంత భయం. ప్రతిపక్ష నేతగా జగన్ రోడ్డుమీదకు వస్తే లక్షలాదిమంది తరలివస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. మతరాజకీయాలకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. తిరుమల ఈవో వెజిటబుల్ ఆయిల్ వాడారని చెబుతారు. చంద్రబాబు జంతువు కొవ్వు కలిపారని చెబుతున్నారు. ఏపీ పేరును దిగజార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నామతం మానవత్వం అని చెప్పిన దమ్మున్న నాయకుడు మా జగన్ మోహన్ రెడ్డి. మీకోపం ఏదైనా ఉంటే చంద్రబాబు పై చూపాలని ఆ వేంకటేశ్వరుడిని కోరుకున్నాం. రాష్ట్రప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నాం. చంద్రబాబు,పవన్ ,బీజేపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్ధించాం. వైఎస్సార్….వైఎస్ జగన్ సీఎంగా తిరుమలను దర్శించుకున్నారు. పాదయాత్ర పూర్తి చేసి జగన్ తిరుమలను దర్శించుకున్నారు. అనేక మార్లు తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఎందుకివ్వాలని ప్రశ్నించారు.
=============================