సిరా న్యూస్,సూర్యాపేట;
జిల్లా కలెక్టరేట్ లో వృద్ధ దంపతులు పిడమర్తి వెంకన్న, ఎలిషమ్మలు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తమని కోడలు రజని పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. కొడుకు చిరంజీవి మాజీ సీఎం కెసిఆర్ వద్ద గన్ మెన్ గా ఉద్యోగం చేసే సమయంలో తమ ఆస్తులు తీసుకున్న కోడలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.