సిరా న్యూస్;
పలాసలో రూ.72 కోట్లతో పరిశోధనా కేంద్రం సిద్ధం
ఈ నెల 14న ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
వేలాది మంది బాధితులకు ఊరట
ఉద్దానంలో దశాబ్దాలుగా అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఇక్కట్లు పడుతున్న వేలాది మంది కష్టాలకు చరమగీతం పాడేలా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం సిద్దమైంది. దీనికి డాక్టర్ వైయస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రభుత్వం పేరు పెట్టింది. 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ పరిశోధనా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ఈ ఆసుపత్రిని ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పరిశోధనా కేంద్రం ఉద్దానం ప్రజల్లో కోటి ఆశలను రేకెత్తిస్తోంది. రూ 53.24 కోట్ల నిర్మాణ వ్యయం, రూ.20 కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలు కలిపి రూ.74.24 కోట్లతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రం స్థాపించారు