సిరా న్యూస్,మైలవరం;
లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆతమ్మహత్య చేసుకుంది. ఈ నేపధ్యంలో శనివారం కళాశాలకు సెలవును యాజమాన్యం ప్రకటించింది. మృతురాలు చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని. విషయం తెలిసిన విద్యార్ధిని తల్లిదండ్రులు,బందువులు
కళాశాలకు ద్దకు చేరుకున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఎం జరిగిందో చెప్పాలంటూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకుంటే వార్డెన్ పర్యవేక్షణ ఏది అంటూ నిలదీసారు.