సిరా న్యూస్, చిగురుమామిడి
శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక మే డే
* బొమ్మనపల్లి గ్రామ శాఖ కార్యదర్శి అందే సంపత్
* బొమ్మనపల్లిలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
శ్రమజీవుల సంఘటితశక్తికి ప్రతీక మే డే అని సీపీఐ, కార్మిక సంఘం నాయకులు అన్నారు. చిగురుమామిడి మండల వ్యాప్తంగా సీపీఐ పార్టీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాలు ఆవిష్కరించారు. బుధవారం బొమ్మనపల్లి గ్రామంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ బొమ్మనపల్లి గ్రామ శాఖ కార్యదర్శి అందే సంపత్ జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ అనుబంధ సంఘాలైన ఆదర్శ భవన నిర్మాణ తాపీ కార్మిక సంఘం ఎదులాపురం సదానందం, హమాలి సంఘం చట్ల మొగిలి, ఆదర్శ హమాలి సంఘం కొంకట బాలయ్య, తెలంగాణ హమాలి సంఘం తాళ్ల రాజయ్య, పెయింటర్ సంఘం కొంకటరాజు అధ్యక్షులు జెండాలను ఆవిష్కరించారు.వారు మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని వారి పోరాట ఫలితమే నేటి మేడే దినోత్సవం అని అన్నారు.వారి స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం ముందుకెళ్తామన్నారు. కొబ్బరికాయ కొట్టి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.