సిరా న్యూస్,ఆసిఫాబాద్;
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తమ మూడు సంవత్సరాల కూతురు స్వర ను అంగన్వాడీ కేంద్రానికి పంపి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు ఆదర్శింగా నిలిచారు.
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తన 3 ఏళ్ల కూతురు స్వరాను ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంగన్వాడి స్కూల్ లో చేర్పించారు అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కూర్చుని ఆట వస్తువులతోఆడుకుంటు అంగన్వాడి కేంద్రంలో వండిన భోజనం తింటున్న దృశ్యాలు అందరినీ అలరించాయి. కార్పొరేట్ పాఠశాలల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే అక్షర సత్యాన్ని కలెక్టర్ దంపతులు గుర్తించారు. అంగన్వాడీ కేంద్రాల్లో శిశువులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను గుర్తించి ఆదర్శంగా నిలిచారు కలెక్టర్ దంపతులు.