సిరాన్యూస్, ఖానాపూర్
పోరాటాల ఫలితంగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు
తెలంగాణ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గుడిసె సంపూర్ణ
దీర్ఘాకాలిక పోరాటాల ఫలితంగానే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు రిటర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం పెంచడం హర్షనీయమని తెలంగాణ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గుడిసె సంపూర్ణ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీచర్ల సమస్యలపై యూనియన్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించిన హామీ అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీచర్లకు రూపాయలు రెండు లక్షలు హెల్పర్లకు రూపాయలు లక్ష ప్రకటించడం హర్షనీయమన్నారు. అంగన్వాడి టీచర్ల హామీలను అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వేడుమ బొజ్జు, కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.