కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్…
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రజా భవన్ (ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం) ముట్టడి…
ఈ సంధర్బంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీ భాగంగా ఇబ్రహీంపట్నంలో ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరవధికత సమ్మె చేశామని ఆ సమ్మెలో భాగంగా అంగన్వాడి జేఏసీతో ఆనాటి ఆర్దిక మంత్రి హరీష్ రావు , మంత్రి సత్యవతి రాథోడ్ తో చర్చలు జరిపామని రిటర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడి టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష ఆసరా పింఛన్లు చెల్లిస్తామని 60 సంవత్సరాలు లోపు రిటైర్డ్ అయిన అంగన్వాడి టీచర్స్ హెల్పార్లకు విఆర్ఎస్ వర్తింప చేస్తామని హామీ ఇచ్చారని అంగన్వాడీ టీచర్ రాజ్యాలక్ష్మి గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ పిఆర్సి లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఐదు శాతం ఐఆర్ ను అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు వర్తింప చేస్తామని మినీ అంగన్వాడి సెంటర్లను మెన్ సెంటర్లు గా అప్డేట్ చేస్తామని జీవో ఇస్తామని సమ్మె కాలంలో వేతన చెల్లిస్తామని పైన సమస్యల పైన హామీ ఇచ్చారు…
ఈ ప్రభుత్వం కూడా అంగన్ వాడి ల సమస్యలకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్క హామీలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ముఖ్యంగా జీవో నెంబర్మ్స్ms నెంబరు10 రద్దు చేయాలి, రిటర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు ఇస్తూ జి ఓ జారీ చేయాలని,లక్ష పెంచి పెన్షన్ విఆర్ఎస్ కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ..
అంగన్వాడి ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలి కనీస వేతనం 18,000 ఇవ్వాలి పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని 24 రోజుల సమ్మె కాలం వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ..
వేతనాలు ప్రతినెల 5వ తేదీ లోపు అంగన్వాడి టీచర్లకు హెల్పాలకు చెల్లించాలని రెండోవ పిఆర్సి ప్రకారం ఐదు శాతం వర్తింపచేస్తూ జీవో జారీ చేయాలని అన్నారు.
వాలంటరీ రిటైర్మెంట్ కేమును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.