సిరాన్యూస్, బోథ్
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన బోథ్ వాసులు
* మండల సమస్యల పైన వినతి పత్రం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పలు సమస్యలు పరిష్కరించాలి అని బోథ్ వాసులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి వినతి పత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం బోథ్ ఎక్స్ రోడ్ నుండి బోథ్ వరకు రోడ్ మొత్తం చెడి పోయింది. కొత్త రోడ్ మంజూరు చేయాలని, బోథ్ పోచ్చెర నుండి బోథ్ వరకు సెంట్రిగ్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బోథ్ పట్టణం లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో హైమస్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు .అలాగే మండలం లోని పలు సమస్యలు సానుకూల పరచాలి అని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందించి త్వరలో సమస్యలు అన్ని సానుకూల పరుస్తం అని తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో బోథ్ వాసులు మెరుగు బోజన్న, కుర్మే మహేందర్, అడేపు కిరణ్, భీమా గంగమల్లు, మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ పాల్గొన్నారు.