Anil Jadhav:ఎంఎల్‌సీ కవిత అరెస్టు అప్రజాస్వామికం

సిరా న్యూస్, గుడిహత్నూర్
ఎంఎల్‌సీ కవిత అరెస్టు అప్రజాస్వామికం
* బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఎంఎల్‌సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమ‌ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలకేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్‌లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్,బీ.జె.పి కలసి కుట్ర చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ అని చూడకుండా ముందస్తు సమాచారం లేకుండా ఒక తీవ్రవాదిని, దేశద్రోహిని అరెస్టు చేసినట్లు ఒక ప్రజా ప్రతినిధిని అరెస్టు చేయడం ఆప్రజాస్వామ్యంగా భావిస్తున్నామ‌న్నారు.పవిత్ర భారతదేశంలో స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా… మోడీ ఇది ప్రజాస్వామ్యం నియంత పాలన కాదన్నారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపడతామ‌ని, ప్రజా క్షేత్రంలో, న్యాయపరంగా తేల్చుకుంటాం అని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *