సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గోపిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట వైసీపీ యంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని అధిష్టానం ప్రకటించడం శుభపరిణామం. అందరి ఆమోదంతోనే అనిల్ కుమార్ పేరు ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులా అనిల్ కి పేరు. బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. బీసీలకు వైసీపీ పార్టీ ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని అన్నారు.
అందరం కలిసి అత్యధిక మెజారిటీతో అనిల్ ని గెలిపించుకుంటాం. చంద్రబాబు బీసీలకు న్యాయం చేస్తామని కేవలం మాటల్లోనే చెబుతాడు. కానీ ఆచరణలో చూస్తే కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే సీటు ఇస్తాడు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేటకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి తీసుకొస్తామని అన్నారు.