సిరా న్యూస్,ముంబై;
నిమల్’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ నెలకొనడానికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా! తెలుగులో ఆయన తీసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా! సందీప్ రెడ్డి వంగాకు రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో తోడు కావడంతో సినిమాపై ముందు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సినిమా ఎలా ఉంది?
దేశంలోని అత్యంత సంపన్నులలో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని. రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) ఆయన కుమారుడు. విజయ్ కాస్త అగ్రెసివ్. అక్కను ర్యాగింగ్ చేశారని కాలేజీకి గన్ తీసుకెళ్లి విద్యార్థులను భయపెడతాడు. కుమారుడి ప్రవర్తన తండ్రికి నచ్చదు. బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత బావతో జరిగిన గొడవ కారణంగా తండ్రి కొడుకుల మధ్య దూరం మరింత పెడుతుంది. రణ్ విజయ్ సింగ్ అమెరికా వెళతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత ఇండియా వస్తాడు. అటాక్ చేసిన వాళ్ళ తలలు తెగ నరుకుతానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? వాళ్ళ సంసార జీవితం ఎలా ఉంది? బల్బీర్ సింగ్ మీద ఎటాక్ చేసింది ఎవరు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి.