Anjaneya Colony: ఆంజ‌నేయ కాల‌నీలో వీధి కుక్క‌ల బెడ‌ద‌

సిరాన్యూస్‌, పెద్దాపురం
ఆంజ‌నేయ కాల‌నీలో వీధి కుక్క‌ల బెడ‌ద‌

వీధి కుక్క‌ల స‌మ‌స్య రోజు రోజుకీ జ‌ఠిల‌మ‌వుతోంది. పెద్దాపురం పరిధిలోని ఉన్న ప్రసన్న ఆంజనేయ కాలనీ లో ఎటుచూసినా గుంపులు గుంపులుగా వీధి కుక్క‌లు సంచ‌రిస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్క‌ల బారిన ప‌డి గాయాల‌పాల‌వుతున్న సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. రోడ్డు పై వెళ్తున్న వారిని అరుస్తూ వెంటపడుతున్నాయి. బైక్‌పై వెళ్తున్న వారికి అడ్డుగా వ‌స్తున్నాయి.దీంతో వాహనదారులు కింద పడుతున్నారు. పిల్లలను రోడ్డు మీద ఒంటరిగా పంపలాన్న భ‌యం గా ఉంటుంద‌ని కాల‌నీ వాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నుండి కాపాడాల‌ని కాల‌నీవాసులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *