సిరా న్యూస్, ఆదిలాబాద్:
ముగిసిన అంజనీపుత్ర క్రికెట్ టోర్నమెంట్…
+ విజేతగా నిలిచిన బండల్ నాగపూర్ జట్టు
+ బహుమతులను ప్రధానం చేసిన సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గత నెల రోజులుగా అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు శనివారంతో ముగిసాయి. ఫైనల్స్ లో టీం 11 జట్టు ను బండల్ నాగపూర్ జట్టు ఓడించి విజేతగా నిలిచి, రూ. 50వేల నగదు బహుమతితో పాటు కప్ ను కైవసం చేసుకుంది. కాగా రన్నరప్ గా నిలిచిన టీం 11 జట్టుకు రూ. 30 వేలు, తృతీఈయ స్థానంలో నిలిచిన బాలాపూర్ హనుమాన్ జట్టుకు రూ. 20 వేలు, నాలుగవ స్థానంలో నిలిచిన చాందా – టీ జట్టు రూ. 10 వేలను సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ గుర్రాల కిరణ్, డిప్యూటీ డైరెక్టర్లు ప్రసన్న కుమారి, సరోజ, చీఫ్ జనరల్ మేనేజర్లు కృష్ణా, లింగన్న, జనరల్ మేనేజర్ శ్యాం సుందర్, టోర్నీ నిర్వాహకులు జనగం మహేష్, రాసర్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.