సిరాన్యూస్, చిగురుమామిడి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: బొమ్మనపల్లి ఏఎన్ఎం ధనలక్ష్మి
* బొమ్మనపల్లిలో ఉచిత వైద్య శిబిరం
ప్రస్తుత వర్షాకాల సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బొమ్మనపల్లి ఏఎన్ఎం ధనలక్ష్మి అన్నారు.చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ టెస్ట్ లు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలని సూచనలు చేశారు. జ్వర లక్షణాలు ఉంటే తప్పకుండా తమని సంప్రదించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ స్వరూప, రమేష్, ఈ రమేష్, ఆశా కార్యకర్తలు సుజాత సుగుణ లింగవ్వ ప్రజలు పాల్గొన్నారు.