సిరా న్యూస్,నందిగామ;
ఎంపీ కేశినేని చిన్ని నందిగామ లో అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. చిన్ని మాట్లాడుతూ 100 రోజుల్లో అన్న క్యాంటిన్ తిరిగి ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు చేశాం. అన్న క్యాంటిన్ రద్దు చేసిన వైసిపి ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారు. దాతల సహకారంతో అన్న క్యాంటిన్ మెయింటెనెన్స్ చేసేలా చూస్తాం. ఆడుదాం ఆంధ్ర , జోగి రమేష్ పై సిఐడి విచారణ ను స్వాగతిస్తున్నా. వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ కి వెళితే తెలిసింది ఎంత స్కాం జరిగిందో. జోగి రమేష్ అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి జప్తు చేస్తే వాటిని తన కుటుంబ సభ్యులపై రాయించుకున్నారని అన్నారు.