సిరా న్యూస్, భీమదేవరపల్లి
రెండవ పురుషుల సంఘం అధ్యక్షుడిగా అన్నబోయిన రవి
భీమదేవరపల్లి మండలం, మల్లారం రెండవ పురుషుల సంఘం అధ్యక్షుడిగా అన్నబోయిన రవి, ఉపాధ్యక్షుడిగా గుగులోతు సక్రు, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన 20/4వ నిర్వహించిన మహాసభలో అధ్యక్షుడి పదవి కాలం ముగియడంతో, ఎన్నికలు చేపట్టగా రవి,సక్రు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యులు సంవత్సరం అధ్యక్షుడి పదవిలో ఉంటాడని తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, మల్లారం నూతన పాలకవర్గ సభ్యులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.