సిరాన్యూస్, ఆదిలాబాద్
బాధితురాలిని ఆదుకోవాలి : సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* రిమ్స్ డైరెక్టర్‌కు వినతి పత్రం అందజేత
రిమ్స్ బాధితురాలిని ఆదుకొని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఐహెచ్ఎఫ్ ఎంఎస్ విభాగంలో పేషంట్ కేర్ గా పనిచేస్తున్న గణపతి లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గురువారం రిమ్స్ కార్మికులందరూ విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేసి, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికురాలిని రాత్రి 10:30 గంటల ప్రాంతంలో హెడ్ సూపర్ వైజర్ అకారణంగా పనిలో నుండి వెళ్లిపొమ్మనడంతో మనస్థాపానికి గురై ఈ చర్యకి పాల్పడ్డట్టు బాధితురాలు వివరించారని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన సూపర్ వైజర్ ను విధులనుండి తొలగించాలని ,బాధితురాలికి 5 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉత్తమ చికిత్స అందించాలని, ఆమె కోలుకుని విధుల్లో చేరేంత వరకు వేతనంతో కూడిన సెలవులు అందించాలని డిమాండ్ చేసారు. చర్యలు తీసుకో లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ నవీన్ కుమార్, అగ్గిమల్ల స్వామి, రిమ్స్ నాయకులు పెర్క దేవిదాస్, అక్రమ్ ఖాన్, సుభాష్, దశాంత్, రమేష్ ,శేఖర్, ఖలీల్ సుమన్, తాయి రాణి, అనసూయ రిమ్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.