సిరాన్యూస్, ఆదిలాబాద్
రెండవ ఏఎన్ఎంలకు పనిభారాన్ని తగ్గించాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* జనాభా ప్రాతిపదికన రెండవ ఏఎన్ఎంలను కేటాయించాలి
రెండవ ఏఎన్ఎంలకు పనిభారాన్ని తగ్గించాలని సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాథోడ్ నరేందర్ కు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏఎన్ెం సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న మొత్తం 12 మంది ఏఎన్ెం లు పనిచేస్తున్నారు. ఒక్కొక్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో వున్న ఏఎన్ ఎం కు దాదాపుగా 15000 నుండి 20,000 వరకు జనాభా ఉంది గతంలో పీపీ యూనిట్ పరిధిలో ఉన్న జనాభా ను ,అక్కడ పని చేస్తున్న ఏఎన్ ఎం లను అర్బన్ హెల్త్ సెంటర్లో కాలపాలాన్ని జి.ఓ ఇవ్వటం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అర్బన్ అర్బన్ హెల్త్ సెంటర్లకు పీపీ యూనిట్ జనాభాను యూ.పీ.హెచ్.సి లలో కలిపి అక్కడ ఏఎన్ఎం లను యధావిధిగాపి.పి యూనిట్ లోనే కొనసాగుతున్నారని, తద్వారా యూపీహెచ్సి ఏఎన్ఎం లను అదనపు జనాభా భారం పెరిగిందన్నారు. ప్రతి యూపీహెచ్‌సీ లో అదనపు ఏఎన్ఎం లను నియమించి ఏఎన్ ఎం లపై పెరిగిన పని భారం తగ్గించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న,తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్. నవీన్ కుమార్ ఏఎన్ ఎం నాయకులు పుష్పలత,తులసి అన్నపూర్ణ,తదితరులు పాల్గొన్నారు.