సిరాన్యూస్, ఆదిలాబాద్
పర్సా స్పూర్తితో కార్మిక హక్కుల సాధనకై పోరాడుదాం: సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* సీఐటీయూ ఆధ్వర్యంలో కామ్రేడ్ పర్స సత్యనారాయణ వర్ధంతి
పర్సా స్పూర్తితో కార్మిక హక్కుల సాధనకై పోరాడుదామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనములో కార్మిక ఉద్యమ నేత, సీఐటీయూ వ్యవస్థాపకులు కామ్రేడ్ పర్స సత్యనారాయణ వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ కామ్రేడ్ పర్స సత్యనారాయణ గుంటూరు జిల్లా సత్తనపల్లి గ్రామంలో జన్మించారని, నాడు నిజాం దోపిడీకి పీడనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, జైలు జీవితం 2 సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపారని తెలిపారు. కార్మిక వర్గం అంతా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని అన్నారు.కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రే, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, సీఐటీయూ జిల్లా కోశాధికారి కే.సునిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దర్శనాల నాగేష్, ఐద్వా జిల్లా కోశాధికారి ఆర్.మంజుల, సీఐటీయూ జిల్లా నాయకులు రమాకాంత్,అరుణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కోశాధికారి స్వామి, ఆశన్న, గిరిజన సంఘం జిల్లా కోశాధికారి ఆత్రం కిష్టన్న,తదితరులు పాల్గొన్నారు.