Annamolla Kiran: కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం:  సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్

సిరాన్యూస్ , ఆదిలాబాద్‌
కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం:  సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* సీఐటీయూ 55 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామ‌ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సీఐటీయూ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ పతాకాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు కార్మికులకు పంచారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడారు. 1970 సంవత్సరంలో మే 30న బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా మహానగరంలో కార్మిక పోరాటాల సారథి ఐక్య పోరాటాల వారధి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఏర్పడింది. ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడిన సీఐటీయూ నాటి నుండి నేటి వరకు భారతదేశ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాల పైన కార్మిక హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే 54 వసంతాలు పూర్తిచేసుకుని 55వ వసంతంలోకి అడుగుపెడుతుందని అన్నారు. కార్మికులకు కార్మికుల శ్రేయోభిలాషులకు ఉద్యోగులకు ప్రజలకు సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.భారతదేశ కార్మిక ఉద్యమంలో సీఐటీయూ నిర్వహించిన పాత్ర అమోఘమైనదని ముఖ్యమైనదని అన్నారు. కార్మిక పోరాటాలే కాకుండా రైతన్నల పోరాటాలకు ప్రజా పోరాటాలకు బాసటగా నిలుస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాటాలు నిర్వహిస్తూ సామాజిక ఉద్యమాలకు సంఘీభావాన్ని అండదండలను అందజేస్తూ దేశభక్తి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని అన్నారు.కానీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1926 నుండి భారత దేశ కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను చట్టాలను ఈ పదేళ్ల పరిపాలన కాలంలో నిర్వీర్యం చేసింది. కార్మిక చట్టాలను సవరిస్తూ నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. సమ్మె చేసే హక్కును సంఘం పెట్టుకునే హక్కును ఎనిమిది గంటల పని దినాన్ని దూరం చేసింది. కావున భారతదేశ కార్మిక వర్గం కార్మిక చట్టాలను పునరుద్ధరించుకోవాలని ఎనిమిది గంటల పని దినాన్ని పునరుద్ధరించుకోవాలని హక్కుల సాధన కోసం జరిగే పోరాటాలలో కార్మిక ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో పాల్గొనాలని పిలుపునిస్తున్నామ‌ని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి , నాయకులు పండుగ పొచ్చన్న, తోకల శ్రీకాంత్, సిరిగిరి దశాంత్ ,దర్శనాల నగేష్ మంజుల, సుజాత రమాకాంత్, రాంజీ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *