సిరాన్యూస్, ఆదిలాబాద్
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
* కలెక్టరేట్ ఎదుట కార్మికుల ఆందోళన
గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ , తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు. గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికులకు 50 వేల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని అన్నారు. మరణించిన కార్మికులకు మట్టి ఖర్చులకు 50 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఇతర డిమాండ్లన్నిటినీ పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, లింగాల చిన్నన్న, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దర్శనాల నాగేష్, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు, సోనేరావ్ ,వెంకట్రావు, రమక్క, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు ఎం జనార్దన్, బొజ్జ ఉశన్న, మల్లాక్క, శ్యామ్, ఆత్మరాం, భాస్కర్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు శంకర్, కిరణ్, ఇంద్రజ్ అశోక్, శివ, గంగన్న, ప్రకాష్, విలాస్ తదితరులు పాల్గొన్నారు.