పిన్నెల్లిపై మరో కేసు నమోదు

 సిరా న్యూస్,మాచర్ల;
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఆయనను బుధవారం అర్ధరాత్రి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు లోపలికి తీసుకెళ్తుండగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శివను కడుపులో కొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో తనపై పిన్నెల్లి దాడికి పాల్పడ్డారని శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 303 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *