సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. లంగర్ హౌజ్ టిప్పుఖాన్ ఫూల్ బ్రిడ్జ్ వద్ద మోటర్ సైకిల్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఘటనలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాపడినవారిని హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ ఓ హోటల్ లో వేయిటర్లుగా పని చేస్తున్నారు.
====================