సిరా న్యూస్,కొత్తగూడెం;
సింగరేణి బాలికల పాఠశాలలో తెలుగు టీచర్ విద్యార్థులపై అసభ్య ప్రవర్తన చేస్తున్నారంటూ పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సదరు టీచర్ కొత్తగా పాఠశాలకు డిప్యూటేషన్ పై వచ్చినట్లు సమాచారం. సుమారు 10 మంది బాలికలపై అసభ్య ప్రవర్తన పిర్యాదులు వచ్చాయి. బాలికలు, తల్లి తండ్రులు వచ్చి పిర్యాదు చేసినా చర్యలు చేసుకోవట్లేదంటూ తల్లితండ్రులు ఆరోపించారు. ఎన్ని ఘటన లు జరిగిన విద్య బుద్దులు నేర్పాల్సిన టీచర్ లు ఈ విధమైన చర్యలు చేస్తుండటం సిగ్గు చేటని ఆందోళన చేసారు.తెలుగు టీచర్ పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో స్కూల్ నుండి వెళ్ళేది లేదని బైటాయించారు.