సిరా న్యూస్,హైదరాబాద్;
ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుంది. తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశముంది. విజయవాడ, ఖమ్మం నగరాలు ఇంకా వరద ముంపులోనే వుంది. వర్షాలతో ఏపీలో 19 మంది, తెలంగాణలో 16 మంది మృతి చెందారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు పునరుద్ధరించారు. వరదలతో 570 బస్సులను టీజీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. వరదలతో 481 రైళ్లు రద్దు, 152 రైళ్లు దారి మళ్లించారు.