సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం నగరంలోని ఓ ప్రయివేట్ జూనియర్ కళాశాల మూడవ అంతస్తు పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసాడు. పోలీసు లైన్ లో ఉన్న ఎస్ఆర్ కాలేజ్ క్యాంపస్ లో ఘటన జరిగింది. జూన్ నుండి ఇప్పటి వరకూ వేర్వేరు కారణాలచే ముగ్గురు విద్యార్దులు ఒకే క్యాంపస్ లో మృతి చెందారు. విద్యార్థి కోదాడ గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టిపల్లి లోకేష్ (16) ఆత్మహత్యాయత్నం చేసాడు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి ని కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. ఫోన్ చేసిన యాజమాన్యం రెస్పాండ్ అవ్వకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్సార్ కాలేజీ వద్ద ఆందోళన చేస్తున్నారు.