సిరా న్యూస్,కొత్తగూడెం;
పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తాయ్యాయి.
కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం ఐదు నియోజకవర్గాల ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ లకు పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీ లోని స్ర్టాంగ్ రూంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు. కౌంటింగ్ కేంద్రం, స్ర్టాంగ్ రూంల వద్ద మూడంచెల్లో పటిష్ట భద్రత చేసారు. ఈ నెల 3వ తారీఖన ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.