Anusha Chand Begum: డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం  :డాక్టర్ అనుష చాంద్ బేగం

సిరాన్యూస్, కుందుర్పి
డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం  :డాక్టర్ అనుష చాంద్ బేగం
* కుందుర్పి పీహెచ్‌సీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

డెంగ్యూ వ్యాధిని నివారిద్దామ‌ని డాక్టర్ అనుష చాంద్ బేగం అన్నారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కుందుర్పి మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గ‌ల‌ కుందుర్పి గ్రామంలో ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ వ్యాధి ని నివారిద్దాం అన్నా నినాదంతో అవ‌గాహ‌న ర్యాలీ నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంద‌న్నారు. పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా దోమలు మంచినీరు నిల్వ ఉన్నచోట గుడ్లుపెట్టి అభివృద్ధి చెందుతాయి కనుక , అవి పెరగకుండా ఫ్రైడే డ్రైడే అందరు పాటించాలని తెలిపారు.నీరు నిలువ చేయు పాత్రలు ప్రతి వారం ఖాళీ చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.దోమ కుట్టకుండా జాగ్రత్తలు పాటించ‌డం, దోమతెరలు వాడుట, ఇంట్లో పొగ పెట్టి దోమలను తరిమివేయుట చేయాలని చెప్పారు. కార్య‌క్ర‌మంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *