సిరా న్యూస్,విజయవాడ;
ఎపీ బేవరెజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి అనకొండలా మారారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. వంద కోట్లు అక్రమంగా దోచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఆయన చేసిన అవినీతి, దోచుకున్న వందల కోట్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు.
సీబీఐతో దర్యాప్తు చేయించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి
సీఎం జగన్ ఇటువంటి అవినీతిపైరులపై చర్యలు తీసుకోరని మాకు తెలుసు. మా డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని ఆయన పై విచారణ చేయాలి. వాసుదేవరెడ్డి అనే వ్యక్తి బెవరేజెస్ ఎండీగా 2019 నుంచి బాధ్యతలు స్వీకరించారు. మద్యం దుకాణాల్లో సెక్యూరిటీ గార్డును నియమించి 11వేలు జీతంగా నిర్ణయించారు. 2,934 షాపులకు సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉండగా 1400షాపులకు మాత్రమే నియమించారు. ఈ నాలుగేళ్లుగా 1500 షాపులకు గార్డులు ను నియమించకండా 80కోట్లు ఓపీయస్ సెక్యూరిటీ ద్వారా దోచుకున్నారు. 2934 మంది టెండర్లు పిలిచి 1400 మందికి మాత్రమే జీతాలు చెల్లించేది వాస్తవం కాదా. ఓపీడీయస్ సెక్యూరిటీ సంస్థ ద్వారా జరిగిన వాసుదేవరెడ్డి అవినీతిపై విచారణ చేయాలని అయన అన్నారు.
ఓపీడీయస్ సంస్థ జియస్టీ ఎగ్గొట్టిన డబ్బు 130 కోట్లు. ఓపీడీయస్ సెక్యూరిటీనే నిబంధనలకు విరుద్దంగా కొనసాగించారు. ఈ యేడాది బాలాజీ సెక్యూరిటీ సర్వీసెస్ అనే బినామీ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. 80 కోట్ల రూపాయులు అయాచితంగా వాసుదేవరెడ్డి లబ్ది పొందారని అన్నారు.