సిరా న్యూస్,జగిత్యాల;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ఈనెల 29న జగిత్యాల జిల్లా కొండగట్టు కు రానున్నారు.
గతం లో కొండగట్టు అంజన్న ను దర్శించుకుని,పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి పూజలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన విషయం విదితమే.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమి భారీ విజయం సాధించడం, ఉపముఖ్య మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు.
భారీ విజయాన్ని సొంత చేసుకోవడంతో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకొని కొండగట్టు పర్యటనకు శ్రీకారం చుట్టారు.
పవన్ రాక కన్ఫామ్ కావ డంతో ఆయన అభిమాను లు ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు.