సిరా న్యూస్;
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజాము నాలుగు గంటలకు ఉత్తర ద్వారంలోస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు బంగారు గరుడ వాహనం అధిరోహించి భక్తులకు సాక్షాత్కరించారు. తెల్లవారుజామునుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయప్రాంగణంకు చేరుకుని భక్తిశ్రద్దలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు బంగారు దక్షిణావృతశంఖుతీర్థం స్వీకరించారు..