ఎమ్మెల్యే పంతం నానాజీ
సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడరూరల్ నియోజకవర్గం రాజేంద్రనగర్ శ్రీకనకదుర్గా ఆలయానికి కాకినాడరూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చారుఉ. అయనకు స్థానిక పెద్దలు ఆలయ కమిటి సభ్యులు సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే నానాజీ శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసారు. ఆలయ అర్చకులు సాయికృష్ణ అమ్మవారికి పూజలు చేసి వేదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ శ్రీకనకదుర్గా అమ్మవారి ఆల య నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు ఈకార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు గుత్తుల శివ, గుత్తుల రవి, కాకరపల్లి శ్రీనివాసు, మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, కొల్లి విశాలాక్షి, గుత్తుల వీరబాబు, మాజీ కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులు, న్యాయవాది కొమ్మూరి శ్రీనివాసరావు, వి.రాజేష్, ఎం.మోహన్, పితాని రాజకుమారి, నరాల ఈశ్వర్ ఎస్.శ్రీనివాస్, ఎస్. సతీష్, జి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.