Aravind: కేసు నమోదు చేయించిన కలెక్టర్ కు అభినందనలు

సిరా న్యూస్, సైదాపూర్
కేసు నమోదు చేయించిన కలెక్టర్ కు అభినందనలు
సీవైఎస్ ఎస్ నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్
లైంగిక వేధింపుల కేసులో వ్యాయామ ఉపాధ్యాయుడిపైన కేసు నమోదు చేయించిన కలెక్టర్కు ఛాత్ర యువ సంఘర్షణ సమితి (సి.వై ఎస్ ఎస్) నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్ అభినందనలు తెలిపారు. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. హెచ్ఎం, ఎంఈఓ, డిఇఓ, ల పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి ఉన్నత పాఠశాలలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని రుజువు అయింది. కేసు కూడా నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. వేధింపులకు పాల్పడిన సదరు ఉపాధ్యాయుడు చూసి చూడనట్టు వదిలేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైన, అలాగే లైంగిక వేధింపుల పైన గ్రామపంచాయతీ నిర్వహించిన మండల విద్యాధికారి పైన ఈ విషయం తెలిసి కూడా రెండు నెలలు మౌనంగా ఉన్న జిల్లా అధికారి పైన ఫోక్సు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాదర్బార్ లో వినతి పత్రం ఇస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *