సిరా న్యూస్,విజయవాడ;
పవర్ ఈజ్ అల్వేస్ పవర్ ఫుల్. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు అందరూ వెంట నడుస్తారు. అపోజిషన్‌లో ఉన్నప్పుడు మనోళ్లు అనుకున్నోళ్లు ఆమడ దూరం వెళ్లిపోతుంటారు. రాజకీయమన్నాక ఇదంతా కామన్. ఇప్పుడిదే పరిస్థితిని ఫేస్ చేస్తోంది వైసీపీ. ఆళ్లనాని నుంచి లేటెస్ట్‌గా వాసిరెడ్డి పద్మ వరకు..అందరూ జగన్‌కు వెన్నదన్నుగా నిలిచినవారే.కాంగ్రెస్‌ను విబేధించి బయటికి వచ్చినప్పటి నుంచి..జగన్ వెంట నడిచిన వారే. ఈ లీడర్లు ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం.. నమ్మిన నేత కోసం పనిచేసిన నేతలు..అధికారంలో ఉన్నప్పుడు తమకు దక్కని గౌరవం, జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ..ఇప్పుడు రాజీనామాలా బాటపట్టారు. లేటెస్ట్‌గా వాసిరెడ్డి పద్మ రాజీనామా చర్చనీయాంశం అవుతోంది.ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. రాజీనామా లేఖను వైసీపీ ఆఫీస్‌కు పంపారు. రిజైన్ లెటర్‌లో వైసీపీ చీఫ్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో జగన్ ప్రజలను అన్నివిధాలుగా మోసం చేశారని.. ప్రభుత్వ మద్యం పేరుతో పేద ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు.ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని.. వైసీపీలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని..ఎన్నో అవమానాలు ఎదురైనా క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేశానని చెప్పుకొచ్చారు వాసిరెడ్డి పద్మ. పార్టీని నడిపించడంలో, పాలనలో జగన్‌కు బాధ్యత లేదని..నియంతృత్వ ధోరణిని ప్రజలు మెచ్చుకోరని ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందన్నారు. జగన్ గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారు..నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదు గుండె బుక్ అంటున్నారు వాసిరెడ్డి పద్మ.ఇప్పటివరకు వైసీపీని వీడిన నేతలు పార్టీ కోసం చాలా త్యాగాలు చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జగన్ వెంట నడిచారు. అధికారంలోకి వచ్చాక జగన్ కూడా వాళ్లకు మంచి స్థానమే కల్పించారు. మోపిదేవి వెంకటరమణ అయినా, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అయినా..వాసిరెడ్డి పద్మ అయినా తగిన న్యాయమే చేశామని చెప్తున్నారు వైసీపీ నేతలు.కానీ గొంతెమ్మ కోరికలు కోరి..పైగా ఇచ్చిన పదవులతో గత ఐదేళ్లు కంఫర్ట్‌గా ఉండి..ఇప్పుడు జగన్ మీద విమర్శలు చేయడమే స్వార్ధపూరితమేనని కౌంటర్ ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవిస్తున్నప్పుడు..వీళ్లకు ఈ లోపాలు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. నచ్చకపోతే అప్పుడే పార్టీకి ఎందుకు దూరంగా ఉండలేదో చెప్పాలంటున్నారు.అయితే నేతలు పార్టీని వీడటం వెనక జగన్ తప్పిదాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. కష్టపడినోళ్ల కంటే పవర్‌లోకి వచ్చాక దగ్గరైన వారికే ఎక్కువగా న్యాయం చేశారంటున్నారు. అలాంటప్పుడు 15ఏళ్లుగా జగన్ వెంట నడుస్తున్న లీడర్లకు అసహనం కలగడంలో న్యాయమే ఉందన్న టాక్ కూడా ఉంది.పార్టీ మారుతున్న నేతలది తప్పా..లేక జగన్ జంపింగ్‌ను కట్టడి చేయలేకపోతున్నారా.. అదీ కాకపోతే లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే అవసరాలు, పరిస్థితులదే ప్రస్తుత సిచ్యువేషన్‌లో కీరోల్ అని స్పష్టం అవుతోంది. జంప్ అవుతున్న కొందరు నేతలకు బిజినెస్‌లు ఉండొచ్చు. కొందరికి ఈ ఐదేళ్లు అపోజిషన్‌లో ఉండే ఇష్టం లేకపోవచ్చు. లేకపోతే అధికార పార్టీ నుంచి ఆఫర్ రావొచ్చు. అధినేత తీరు నచ్చకపోవచ్చు. దీంతో రీజన్ ఏదైనా జంపింగ్ కామన్ అయిపోయింది.