సిరా న్యూస్,మహబూబ్ నగర్;
అసలే కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ ఛీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్న నియోజకవర్గం అది. గులాబీ పార్టీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్కఎమ్మెల్యే సీటు గెలవలేదు. సిట్టింగ్ అభ్యర్థి బలహీనంగా కనిపించడంతో గట్టిఅభ్యర్థినే నిలబెట్టాలనే సంకల్పంతో ఉంది అధిష్టానం. ఎంత మందినిసంప్రదించినా అందరూ పక్కకు తప్పుకుంటున్నారు. చివరికి ఆ నేత మెడకేపార్లమెంట్ అభ్యర్థిగా దండేయనున్నట్లు చర్చలు నడుస్తున్నాయి.పాలమూరుపాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ పక్క కాంగ్రెస్, బీజేపీలో నేనంటేనేను అంటూ ఎంపీ టికెట్ కోసం నేతలు క్యూ కడుతుంటే.. నిన్నటి వరకురాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్లో మాత్రం పరిస్థితి భిన్నంగాకనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి భయానికి ఎంపీ ఎన్నికల్లోపోటీకి నేతలేవరూ ముందుకు రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలోపార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సవాల్గాతీసుకుంది. అందులో భాగంగా ఎంపీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థలతో బరిలోదిగాలని భావిస్తోంది.ముఖ్యంగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్,బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వారికి ధీటుగా అభ్యర్థినిదింపాలనుకుంటున్నారు. సిట్టింగ్‌ను కాదనీ బలమైన నేతనే పోటీ చేయించాలనిగులాబీ అధిష్టానం చూస్తోంది. ఇప్పటికే అభ్యర్థి కోసం విరివిగాసంప్రదింపులు సైతం జరిపిందట. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పఓట్ల తేడాతో ఓడినదేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రిలక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి,నారాయణపేట మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డిలలో చర్చలు జరిపినట్లుతెలిసింది. వీరందరూ పోటీకి దూరంగా ఉంటామనే ఆలోచననే అధిష్టానానికివినిపించారట.
అయితే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీచేసి గెలవడం అంతసులవైన పని కాదని గులాబీ నేతలు ఆలోచనల్లో పడ్డారట. కాంగ్రెస్ నుంచి సీఎంరేవంత్ రెడ్డి ఇంఛార్జ్‌గా ఉండడంతో పాటు ఆయన అసెంబ్లీ నియోజకవర్గంకొడంగల్ సైతం ఈ పార్లమెంట్ పరిధిలోని ఉంది. దీంతో పాటుగా బీజేపీ నుంచిడీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు టికెట్ ఆశిస్తున్నారు.అయితే ఈ రెండు పార్టీలకు ఉన్న పాజిటివ్ టాక్ గులాబీ పార్టీకి లేదనే నేతలుభావిస్తున్నారట. అందులోనూ బరిలో ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడినమాజీ ఎమ్మెల్యేలు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో
అది సాధ్యమయ్యే వ్యవహారం కాదని అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నారట. అయితేపలు దఫాలుగా, పలువురు అధిష్టానం నేతలు తాజా మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడినఎలాంటి ప్రయోజనం లేదని తెలిసింది.
దీంతో మొదట అధిష్టానం భావించినట్లుగాదేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డినే ఎలాగైనా ఒప్పించేప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి, సానుభూతి,
జిల్లాలో అందరినేతలను సమన్వయం చేసుకునే స్వభావం ఉండడంతో ఆయన వైపేమొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఆల బరిలో ఉంటే పార్లమెంట్ నియోజకవర్గంలోఓడిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీకోసం ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేసేఅవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇంత డిస్కషన్ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల బరికి దూరంగా ఉండాలని ఆల వెంకటేశ్వర్
రెడ్డి ప్రధాన అనుచరులు సూచిస్తున్నారట. అధిష్టానం బుజ్జగింపులకు ఆలతలగ్గొతారా.. అనుచరుల సూచనకే ఆమోదం వేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.