ఊరంతా గండ్ర దీపాలతో అమ్మవారి దర్శనానికి ఆడపడుచులు
సిరా న్యూస్,పి గన్నవరం;
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురులో శ్రీశ్రీశ్రీ ఆర్ల అక్కమ్మ జాతర కు భక్తులు పోటెత్తారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి జాతర గండ్ర దీపాలతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఊరి జనం అంతా ఒక్కసారిగా తలపై గండ్ర దీపాలతో అమ్మవారి దర్శనానికి వచ్చారు. గ్రామంలో ఉన్న ఆడపడుచులు మాత్రమే గండ్ర దీపాలు ఎత్తుకోవడం అచారం ఆనవాయితీగా వస్తుంది. గండ్ర దీపాలు వెలిగించి అమ్మవారికి దర్శించుకుని మొక్కులు చెల్లించు కుంటే కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా అక్కమ్మ అమ్మవారు పేరోందింది. పిల్లు లేనివారికి పిల్లులు కలగడం, పెళ్లి కనివారు అమ్మవారిని దర్శించుకుంటే పెళ్లిళ్లు జరుగుతాయని గ్రామస్తుల నమ్మకం. ఇతర రాష్ట్రాల తోపాటు ,ఇతర దేశాలలో ఉన్న ఊరు గ్రామస్తులు అమ్మవారి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆచారం..
=====================