రాత్రి గస్తీ కోసం ఆర్మ్ డ్ సిబ్బంది

 సిరా న్యూస్,కాకినాడ;
యాంకర్: కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంతో పాటు ఈ నగరాన్ని చేర్చి ఉన్న రూరల్ ప్రాంతంలో గత కొంతకాలంగా దొంగతనాల సంఖ్య పెరిగింది. అదేవిధంగా కాకినాడ నగరం గంజాయి బ్యాచ్ కు అడ్డాగా మారిందంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్ పి విక్రాంత్ పాటిల్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కాకినాడ, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వాయిస్:ఇందులో భాగంగా ఈ రెండు సర్కిళ్ల పరిధిలో రాత్రివేళ గస్తీ పెంచారు. ప్రస్తుతమున్న లా అండ్ ఆర్డర్ పోలీసుల సంఖ్య సరిపోకపోవడంతో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని కూడా ఇందుకోసం వినియోగిస్తున్నట్లు పర్యవేక్షణ చేస్తున్న కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ వెల్లడించారు .సిటీ, రూరల్ జంట నగరాలుగా ఉన్నాయి. రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలలోకి ప్రవేశించే అన్ని ప్రధాన రహదారుల వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి మరునాటి ఉదయం వరకు రాత్రి గస్తీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అనుమానితులు ఎవరూ బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, ఆకతాయి చేష్టలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా సి ఐ తెలిపారు.దీనికి తోడు ఎస్ పి ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1,2 సి ఐ నూని రమేష్ ఆధ్వర్యంలో రాత్రి వేళ వాహన చోదకులు,డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహిస్తున్నారు.పగలు వాహనాల తనిఖీ చేపడుతున్నారు.అనుమానితులను అదుపులోకి తీడుకుంటున్నారు.మద్యం తాగి వాహనాలు నడిపేవారి ని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తుండగా మందుబాబులకు 10 వేల వంతున జరిమానా లేదా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు.తద్వారా మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య తగ్గడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని సి ఐ లు చైతన్యకృష్ణ, రమేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *