దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్

సిరా న్యూస్;

దొంగిలించబడిన 10,97,600 విలువ గల బంగారు వెండి ఆభరణాలు పూర్తి సొత్తు రికవరీ పోలీసులు

26-27-రోజున అర్ధరాత్రి సల్పల శ్రీనివాస్ కులం గొల్ల వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన వ్యక్తి తన ఇంట్లోకి చొరబడి దొంగతనం కు పాల్పడినాడు, అని అనుమానం కలదు ఫిర్యాదుదారు, నెందుగూరి రామన్న కులం బారే అగ్రిల్, కేతనపల్లి గ్రామంలో నీల్వాయి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పిర్యాదు ప్రకారం క్రైమ్ నెంబర్ 35/2024, U/S. 457, 380, 75 IPC
సెక్షన్ ల తో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు లో భాగంగా వెంటనే ఎస్సై ఆఫ్ పోలీస్, నీల్వాయి, సీఐ ఆఫ్ పోలీస్, చెన్నూర్ రూరల్ పరిసర ప్రాంతాలలో టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. నిందితుని కోసం వెతుకుతుండగా 28-05-2024. మల్లంపేట గ్రామ ప్రారంభం వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో అనుమానస్పదంగా కనిపించిన నిందితుడు సల్పల శ్రీనివాస్ ను పట్టుకోవడం జరిగింది. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు, వెండి ఆభరణాలు, నికర నగదు 2,62,600 ను స్వాధీనం చేసుకొని అతన్ని పిఎస్‌కి తీసుకువచ్చి అరెస్ట్ మెమో జారీ చేయడం ద్వారా అతని అరెస్టును చేసి కోర్ట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది అని సీపీ తెలిపారు.
నిందితుడు సల్పల శ్రీనివాస్ పై గతంలో కూడా వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆస్తి అక్రమాలకు పాల్పడిన కేసులు నమోదు కాబడినవి,
నిందితుని వివరాలు..
సల్పల శ్రీనివాస్ వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన
నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు,
రెండు బంగారు నెక్లెస్‌లు. ఒక్కదాని బరువు 1 ½ తులా,మొత్తం 3 తులాలు,
3 బంగారు గొలుసులు, ఒక్కొక్క దాని బరువు 3 తులాలు,మొత్తం 9 తులాలు,
2 బంగారు మాటీలు బరువు ¼ తులా
2 ఇయర్ రింగ్స్ బరువు ¼ తులా,
ఒక బంగారు ఉంగరం. 0.75 గ్రా,
రెండు బంగారు ఉంగరాలు, 1.5 గ్రాములు,
2 వెండి కాళ్ళ పట్టిలు 6 తులాలు,
2,62,600 నగదు
మొత్తం విలువ 10,97,600
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు శాఖ ప్రజలతో ఏర్పరచుకున్న సత్సంబంధాల వలన మండలంలోని యువకులు సోషల్ మీడియాలో నిందితుని వివరాలు విస్తృతంగా వైరల్ చేసినందున నిందితుని సమాచారం పోలీసులకు తెలిసింది తధానుగుణంగా పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించింది ఈ సందర్భంగా ప్రజలను అభినందిస్తున్నాము మరియు నిందితులను పట్టుకొనడంలో చాకచక్యంగా వ్యవహరించిన చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ మరియు పోలీస్ సిబ్బంది ని అభినందించడమైనది.
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *