సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
సీతారామ ప్రాజెక్టు పురుడు పోసుకున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి నీరు అందించకుండా పక్క జిల్లాకు తరలించడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామం వద్ద కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ లింకు కెనాల్ పనులు వద్ద కాలువలకు దిగి నిరసన నిరసన వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్ట్ జలాల అంశంపై ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద ముఖ్యమంత్రిని కలిసి వివరించేందుకు వెళుతున్న సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వాన్ని అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూమిని కోల్పోయి తీవ్ర అన్యానికి గురైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగమేనని, అలాంటి రైతాంగానికి గోదావరి జనాలను అందించకుండా పక్క జిల్లాకు తరలించడం ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు నీటిని లింకు కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు తరలించేందుకు ఈరోజు పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అందించే గోదావరి జలాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే సాగర్ జలాలతో సస్యశ్యామలంగా ఉన్న పక్క జిల్లాకు, పురుడు పోసుకున్న భద్రాద్రి జిల్లాకు కాకుండా సీతారామ ప్రాజెక్టు నీటిని ఇతర జిల్లాకు తరలించి ఈ జిల్లా రైతాంగాన్ని తీవ్ర అన్యాయానికి గురిచేసారని వారు విమర్శించారు. గోదావరి జలాలను జూలూరుపాడు మండలం తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలన్నారు. అదేవిధంగా అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం జిల్లా నాయకత్వాన్ని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేస్తున్న సిపిఎం పార్టీ నాయకులను జూలూరుపాడు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.