సిరా న్యూస్;
-సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించింది ఈరోజే
ఆర్యభట్ట భారతదేశం తయారుచేసిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. ప్రాచీన భారత ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడూ అయిన ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేసారు.
1975 సంవత్సరం నాటికి భారతదేశానికి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సాంకేతిక విజ్ఞానం అందుబాటులో లేదు.అందువలన అప్పటికి భారతదేశానికి మిత్రదేశమైన సోవియట్ యూనియన్ సహకారంతో వారి దేశంలోని అతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అంతరిక్ష విజ్ఞానంలో పరిణతి, అభివృద్ధి సాంధించటం కోసం, ఆర్యభట్ట ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తయారు చేసింది. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ లోని కాపుస్తిన్న్ యార్ లోని అంతరిక్ష వాహన ప్రయోగ కేంద్రం నుండి కాస్మోస్-3యం అనే ఉపగ్రహ వాహక రాకెట్ సహాయంతో 1975 ఏప్రిల్ 19 న విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
ఈ ఉపగ్రహ ప్రయోగం నిమిత్తమై ఇండియా, సోవియట్ యూనియన్ మధ్య యు ఆర్ రావు సారథ్యంలో 1972 లో అంగీకారం కుదిరింది. ఉపగ్రహం ప్రయోగించినందుకు ప్రతి ఫలంగా సోవియట్ యూనియన్ భారత రేవుల నుండి, ఓడల నుండి లాచింగ్ వాహనాల జాడలు పట్టుటకు (ట్రాకింగు) వారికి భారతదేశం అనుమతి ఇచ్చింది.
96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టు కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ (భూమినుండి ఎక్కువదూరం), 568 కిలోమీటర్ల పెరిజీ (భూమినుండి దగ్గరిదూరం) ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహ ప్రయోగ ఉద్దేశం ఎక్సు కిరణాల అధ్యయనం , భౌతిక, రసాయనిక విధానాధ్యయనం, సూర్య సంబంధిత విజ్ఞాన అధ్యాయనం. ఈ ఉపగ్రహం 1.5 మీటర్ల వ్యాసంతో, 26 పార్శాలు కలిగి ఉంటుంది. ఉపగ్రహపు పైని, క్రింది భాగాలు మినహాయించి అన్ని పార్శాల మీద సౌర ఫలకాలు అమర్చారు. ప్రయోగించిన నాలుగు రోజుల తరువాత, 60 ప్రదక్షణలు పూర్తయిన తరువాత, ఉపగ్రహంలో విద్యుదుత్పత్తిలో లోపం వలన, ఇది పనిచెయ్యడం మానివేసింది. సోవియట్ యూనియన్ మీడియా వార్తల ప్రకారం ఈ ఉపగ్రహం అటు తరువాత కూడా కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తున్నది. ఈ ఉపగ్రహం తిరిగి 1992 ఫిబ్రవరి 11 న భూవాతావరణంలో ప్రవేశించింది.
17 టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన
కర్నూలు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 19 తేదీన ప్రజాగళం పేరుతో పర్యటించునున్నారు.అందులో భాగంగా టిడిపి అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలోజాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సోమశిట్టి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తదితర జిల్లా నాయకులు హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.టిడిపి జిల్లా అధ్యక్షుడు తిక్క రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ 19వ తేదీ ఆలూరు నియోజకవర్గం లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయిందని, ప్రతి టిడిపి కార్యకర్త దాదాపు 50 వేల మందిని పాల్గొనేలా చూడాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రను జయప్రదం చేయాలని కోరారు, హెలీపాడ్ స్థలం నుంచి బయలుదేరి ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారన్నారు..
ఆలూరు నియోజకవర్గం ప్రజలందరూ ప్రజాగళం యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.