సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఐదు సంవత్సరాలుగా తల్లిదండ్రులు న్యాయపోరాటం
* కొడుకు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవవరపల్లి మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన ఆషాడపు దశరథ- లక్ష్మీ దంపతులు గత ఐదు సంవత్సరాలుగా తమ కొడుకు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని న్యాయపోరాటం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం 2018 మే 9న రంగయ్యపల్లికి గ్రామానికి చెందిన ఒకపెళ్లి బరాత్ లో పాల్గొన్న వారి కుమారుడు ఆషాడం రాజేష్ (21)అనుమానస్పదంగా మరణించడం జరిగింది. తమ కొడుకు మృతి పై అనుమానంతో మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించగా ఒక రకమైన విష పదార్థం అతను శరీరంలో ఉందని ఆ విష పదార్థం వల్లే అతను మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని తెలిపారు.ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి తమకు అండగా ఉంటాడు అనుకున్నా కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తమ కుమారుడు చావుకి కారణమైన వారు యదేచ్చగా బయటికి తిరుగుతున్నారని తమ బాధను వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాల నుండి పోలీస్ స్టేషన్లో, మానవ హక్కు సంఘం లో ఫిర్యాదు చేశానన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మా ఆవేదనను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని విశ్వశాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి హైదరాబాదులో ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తమ కొడుకు మృతి కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. లేనియెడల పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు.