Ashamma:కార్మిక సంక్షేమ ప్ర‌భుత్వ ధ్యేయం

సిరా న్యూస్, ఆదిలాబాద్
కార్మిక సంక్షేమ ప్ర‌భుత్వ ధ్యేయం
* కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ
* 21 శాతం ఫిట్ మెంట్ ప్ర‌క‌ట‌న పై ఆర్టీసీ ఉద్యోగుల్లో హ‌ర్షం
* ముఖ్య‌మంత్రి, మంత్రుల చిత‌ప్ర‌టాల‌కు పాలాభిషేకం
కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ అన్నారు.
2017 పీఆర్ సీ కి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్టీసీ ఉద్యోగుల‌కు 21 శాతం ఫిట్ మెంట్ ప్ర‌క‌టించ‌డంపై ఉద్యోగులు కార్మిక నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేసారు.కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బాణ సంచా కాల్చి సంబ‌రాలు చేసుకున్నారు. స్వీట్స్ తినిపించుకున్నారు.సీయం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌,ర‌వాణా శాఖామంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్,జిల్లా ఇంఛార్జి మంత్రి సీత‌క్క‌, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఫ్లెక్సీల‌కు పాలాభిషేకం చేసారు.తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల‌ను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఉద్యోగుల జీత‌భ‌త్యాల విష‌యంలో తీవ్ర అన్యాయం చేసింద‌ని కార్మిక నాయ‌కులు ఆరోపించారు.ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫిట్ మెంట్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే పెండింగ్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల‌ని కోరారు. సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే ప్ర‌భుత్వం గ్యారెంటీ హామీల అమ‌లుకు కృషి చేస్తూ నిరుద్యోగుల‌కు మెగా డీఎస్సీ రూపంలో ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ప్ర‌క‌టించి కార్మికలోక సంక్షేమానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఆర్థిక లోటు ఉన్న‌ప్ప‌టికి ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాల‌న్న ల‌క్ష్యంతో మంచి ప్ర‌జా పాల‌న అందిస్తుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,కళ్లెం భూమ రెడ్డి,నాగర్కర్ శంకర్,కిజర్ పాషా,రుక్మ రెడ్డి,తిప్పి రెడ్డి విట్టల్ రెడ్డి,మొహమ్మద్ రఫీక్,నిమ్మల ప్రభాకర్,బండి దేవిదాస్ చారి,బూర్ల శంకరయ్య,ఉయిక ఇందిరా,మానే శంకర్,వేముల నాగరాజు,శ్రీ రామ్,రాజ్ మొహమ్మద్,షేక్ ఖలీం,సమీ ఉల్లా ఖాన్,సట్ల నాగన్న,తలా చౌష్, అయాస్,మహిళా నాయకురాలు లత,శారదా,అఫ్రోజ్,నల్వాల సుమ,సోనియా మంథని,కార్మికులు ఎల్. రమేష్ జిల్లా కార్యదర్శి ఐ. ఎన్. టి. యూ. సి,డి.వి బాబు ఐ. ఎన్. టి. యూ. సి జిల్లా వైస్ ప్రెసిడెంట్, అనిల్ గ్యారేజ్ ఇంచార్జ్,మాధవ్,కేజీ రెడ్డి,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *